వైసీపీ ప్రభుత్వ అంతం ఎంతో దూరంలో లేదు: మర్రాపు సురేష్

  • ఖచ్చితంగా వచ్చే ఎన్నికల తర్వాత కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
  • సీనియర్ జనసేన నాయకులు మర్రాపు సురేష్

గజపతినగరం నియోజకవర్గం, పవన్ కళ్యాణ్ కి అండగా నిలిచేందుకు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధమయ్యారని, ఈ సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కి అండగా నిలుస్తున్న వారిని, జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే చర్యలకు పాల్పడుతోందని అన్నారు. మంగళగిరిలోని ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ కి అండగా నిలిచిన ప్రజల ఇళ్ళను కూలగొట్టి పైశాచిక ఆనందం పొందిన వైసీపీ ప్రభుత్వ అంతం ఎంతో దూరంలో లేదని అన్నారు. మార్చ్ 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఇప్పటం గ్రామస్తులు స్థలం ఇచ్చారని కక్ష గట్టి రోడ్డు విస్తరణ పేరుతో గ్రామస్తుల ఇళ్లను కూల్చడమే కాకుండా స్వతంత్ర సమర యోధుల విగ్రహాల తొలగిస్తూ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మాత్రం రక్షణ. కక్షగట్టి మరీ ఇప్పటం గ్రామంలో జనసేన మద్దతుదారుల ఇళ్లు ధ్వంసం, బస్సు లేని గ్రామానికి 100 అడుగుల రోడ్డు పేరుతో ఇళ్ళు కూల్చివేత. పవన్ కళ్యాణ్ బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్తే అడుగడుగునా పోలీసు బలగాలను పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసారని, రాష్ట్రం శాంతిభద్రతల విషయంలో రాజ్యాంగ సంక్షోభం దిశగా పయనిస్తోందని అన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల తర్వాత కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని, ఇప్పుడు జరుగుతున్న ప్రతి సంఘటనకి ధీటైన జవాబు ఉంటుందని హెచ్చరించారు. గజపతినగరం హెడ్ క్వార్టర్స్ లో ఆదివారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.