మారంపల్లిలో జనంలోకి జనసేన

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం పట్టణం, మారంపల్లి ఏరియాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జనంలోకి జనసేన కార్యక్రమంలో

  • రైతులకు ఎకరానికి రూ. 8 వేలు సాగు సాయం
  • ఉచిత గ్యాస్ సిలిండర్లు
  • రైతు రక్షణ భరోసా కింద 60 ఏళ్ల పైబడిన చిన్న సన్నకారు రైతులకు నెలకు 5000 పెన్షన్
  • రేషన్ కి బదులుగా 2500 నుంచి 3500 వరకు బ్యాంకులో జమ
  • గత ప్రభుత్వ నిర్ణయాలతో భూములు కోల్పోయిన రైతులకు 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం
  • ఏడాదికి పది లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం
  • ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆరోగ్య భీమా
  • ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు
  • ముస్లిం సోదరులకు సచార్ కమిటీ సిఫారసులు అమలు
  • నిరుపేదలకు నాణ్యమైన ఉచిత విద్య వైద్యం
  • 1 తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య
  • దివ్యాంగులకు 5000 పెన్షన్
  • డొక్కా సీతమ్మ క్యాంటీన్లు నిరుపేద విద్యార్థులకు ఉచిత భోజనం
  • ప్రతి రైతుకు ఉచిత సోలార్ మోటర్లు పంపిణీ
  • మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు కాపులకు తొమ్మిదవ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు
  • ఆత్మహత్య చేసుకొని చనిపోయిన కౌలు రైతులు కుటుంబాలకు లక్ష చొప్పున 30 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం అందిస్తున్నారు
  • ప్రజావాణి కార్యక్రమం జిల్లాల వారీగా నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారులకు దగ్గరికి జనసేన నాయకులను పంపించి వారి సమస్య పరిష్కారం కోసం జనసేన కృషి చేస్తుందని సామాన్య ప్రజలకు కరపత్రాల రూపంలో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు రమేష్, వీరమహిళ షేక్ తార, మమత కుందుర్పి, మండల అధ్యక్షులు జయకృష్ణ, బ్రహ్మసముద్రం మండల అధ్యక్షులు ఆంజనేయులు, వంశీకృష్ణ, ముక్కన్న రాయుడు మహేష్, నీలకంఠ శ్రీహర్ష, ఉదయ్, ప్రణీత్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.