రైతుల ఆక్రందన ప్రభుత్వానికి వినిపించే వరకు జనసేన పోరాటం ఆగదు: బండారు శ్రీనివాస్

  • అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వినతి ప్రత్రం సమర్పించిన -బండారు శ్రీనివాస్

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజక వర్గం, కొత్తపేట మండలం, అవిడి గ్రామంలో రైతులను కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ కలిసి అకాల వర్షాలు కారణంగా నష్టపోయిన పంటను పరిశీలించారు. జరిగిన నష్టాన్ని, ప్రభుత్వా విధానాలు వలన వారు ఎదుర్కొంటున్నా ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో రైతుకు పండించుకున్న పంటకు అమ్ముకొనే స్వేచ్ఛ ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతు అ స్వేచ్ఛను కోల్పోయి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరతో ఇబ్భందులు పడుతున్నారు అన్నారు. ప్రభుత్వం మద్దతు ధర 1530 రూపాయిలు ప్రకటించాం అని చెప్పడం తప్ప, రైతు చేతికి 1300 రూపాయలు గగనంగా ఉంది అని వాపోయారు. దానికి తోడు ప్రభుత్వం ఎకరానికి 45బస్తాలే కొంటాం అని నిబంధనలు పెట్టడంతో, మిగులు పంట ఏమి చేయాలో తెలియని గందరగోళ పరిస్థితిలో ఈ రోజు రైతు ఉన్నాడు అన్నారు. ఇక ఆర్ బి కే విషయానికి వస్తే గడిచిన 5రోజులు నుండి రైతులు వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయకపోవడం, అకాల వర్షాలుతో కేవలం అవిడి గ్రామంలోనే సుమారు 100 లారీలు ధ్యానం వర్షానికి తడిచిపోయింది‌. ఈ నష్టపోయిన పంటకు ప్రభుత్వామే బాధ్యత వహించాలి. రైతుకు నష్టపరిహారం చెల్లించాలి. లేనిపక్షంలో జనసేన పార్టీ తరుపున ఉద్యమిస్తాం అని బండారు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యదర్శి సంగీత్ సుభాష్, బొక్క ఆదినారాయణ, చేకూరి కృష్ణంరాజు, సూరపరెడ్డి సత్య, తోట స్వామి, గారపాటి త్రిమూర్తులుచౌదరి, జాంప్రోలు నాగేశ్వరరావు, భావన శివశంకర్, కంఠంశెట్టి చంటి, చోడపనీడి ఉమామహేశ్వరరావు, సలాది రమేష్, సిద్ధంశెట్టి దుర్గాప్రసాద్, పడాల అమ్మిరాజు, చింతపల్లి సత్తిపండు, మహా దశబాబులు, తులా రాజు, పెద్దిరెడ్డి మల్లికార్జునరావు, నంబు రవికుమార్, అంబటి కిషోర్, నాగిరెడ్డి మహేష్, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.