భవిష్యత్తు మరింత భయంకరం.. ఆంటోని పౌచి

అమెరికాలో ప్రస్తుతం అందరికి ఉన్న ఏకైక ఉమ్మడి శత్రువు కరోనా మహమ్మారి.ఈ మహమ్మారిని తరిమి తరిమి కొట్టాలంటే ప్రజలు అందరూ సహకరించాలి, రాబోవు రోజులు అమెరికాలో మరింత భయంకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి సిద్దంగా ఉన్నాయి. భవిష్యత్తు లో ఎలాంటి సంఘటనలు చూస్తామోననే భయం నన్ను వెంటాడుతోందంటూ అమెరికా అంటువ్యాధుల నిపుణుడు, కరోనా మహమ్మారి ని కంట్రోల్ చేయడానికి ప్రత్యేకంగా నియమింపబడ్డ ఆంటోని పౌచీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆంటోని చేసిన వ్యాఖ్యలతో అమెరికన్స్ లో అలజడి రేగుతోంది. వివరాలలోకి వెళ్తే.

అమెరికాలో కరోనా మహమ్మారి రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రపంచ దేశాలలో ఇప్పటికే కొత్త రూపు సంతరించుకున్న ఈ మహమ్మారి తాజాగా అమెరికాలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. అయితే కేవలం ప్రజల బాధ్యతా రాహిత్యంగా ఉండటం కారణంగానే గతంలో కరోనా అమెరికాపై తీవ్రంగా విరుచుకుపడిందని, కొత్త రకం వైరస్ అమెరికాపై దాడి చేయకముందే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పౌచీ. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఈ మహమ్మారి మరింత ముదిరే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అమెరికాలో ఇప్పటి వరకూ కరోనా కేసుల నమోదు తగ్గిన దాఖలాలు ఎక్కడా లేవని, భవిష్యత్తులో తగ్గుతాయనే ఆశ కూడా లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం అమెరికన్స్ అందరూ చాలా కీలకమైన దశలో ఉన్నారని రానున్న కొద్ది వారాలలో మరింత ఆందోళనగా పరిస్థితులు మారనున్నాయని ఆయన ఆందోళన చెందుతున్నారు .దూర ప్రాంతాలకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే అవసరం అనుకుంటేనే ప్రయాణాలు చేయాలని లేదంటే ఇళ్ళవద్దే ఉండాలని సూచించారు. బయటకి వెళ్ళే తప్పుడు మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని పౌచీ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *