ఇది కదా పండగ.. వకీల్ సాబ్ న్యూ ఇయర్ పోస్టర్
పవర్ స్టార్ ఫాన్స్ కు ఇది కదా అసలైన పండగ. అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్న అసలైన సర్ప్రైజ్.. పవన్ నటిస్తున్న కొత్త చిత్రం వకీల్ సాబ్ నుండి న్యూ ఇయర్ పోస్టర్. ఈ పోస్టర్ వచ్చి అభిమానుల్లో అసలైన న్యూ ఇయర్ సంబరాలు నింపింది. పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా, దిల్ రాజు, బోణి కపూర్ లు నిర్మిస్తున్నారు.
రీసెంట్ గా షూటింగ్ పూర్తి కావడం తో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి అభిమానుల సంబరాలు రెట్టింపు చేసారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా బైక్ నడిపిస్తుండగా.. వెనుకాల శృతి హాసన్ కూర్చుంది. ఇక ఫస్ట్ లుక్ టీజర్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపి టీజర్ ఫై ఆసక్తి నింపారు.