మెగా అల్లుడి కిన్నెరసాని ఫస్ట్ గ్లింప్స్..

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రమణ తేజ డైరక్షన్ లో వస్తున్న సినిమా కిన్నెరసాని. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. విజేతతో తెరంగేట్రం చేసిన కళ్యాణ్ దేవ్ తన సెకండ్ ప్రాజెక్ట్ గా చేస్తున్న సినిమా కిన్నెరసాని. ఈ సినిమాకు సంబందిచిన ఫస్ట్ లుక్ టీజర్ అదే ఫస్ట్ గ్లింప్స్ న్యూ ఇయర్ సందర్భంగా శుక్రవారం రిలీజ్ చేశారు.

ఇక సినిమా టీజర్ విషయానికి వస్తే చేతులో బ్యాగు మాత్రమే ఉండి.. గుబురు గెడ్డంతో.. ఎటు వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంటాడు. అలా తనని లేపిన సూర్య కిరణాలు.. మంచు వర్షం వెనక ఓ బ్యాక్ గ్రౌండ్ సాంగ్. కిన్నెరసాని ఈసారి మెగా అల్లుడు టార్గెట్ గట్టిగా పెట్టినట్టు ఉన్నాడని ఈ టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది. మహతి స్వర సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యేలా ఉంది. ఫస్ట్ గ్లింప్స్ కే మహతి మ్యూజిక్ మెస్మరైజ్ చేశాడు. ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *