ఏలూరు జిల్లా ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు మెరుగుపరచాలి: రెడ్డి అప్పలనాయుడు డిమాండ్

  • 150 పడకలతో ఏరియా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి

ఏలూరు: ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై జనసేన ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి లోని, మెడికల్ వార్డ్, ల్యాబ్ లు, అత్యవసర విభాగము, చిన్నపిల్లల వార్డ్, మెటర్నరీ వార్డ్ లను సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న సేవలు, సౌకర్యాలు, సమస్యలను రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కైకలూరు, చింతలపూడి, ఉంగుటూరు, దెందులూరు తదితర 48 మండలాలకు, నియోజకవర్గాల్లోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేదాని, ప్రతిరోజు 2వేల మంది రోగులు, అవుట్ పేషంట్, ఇన్ పేషెంట్లుగా ఆసుపత్రి ఓపి లో నమోదవుతుతిన్నారని, ఇంత పెద్ద సంఖ్యలో ఆసుపత్రి కి రోగులు వైద్యం కోసం వస్తున్న ఆసుపత్రిలో రోగులకు వైద్యం అందించడానికి సరిపడా డాక్టర్లు టెక్నీషియన్లు కొరత ఉన్నప్పటికీ మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని ఇక్కడ వైద్య సేవలు గురించి పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. అరకొరగా ఉన్న వైద్యులతోనే ప్రజలకు వైద్య సేవల అందిస్తున్నారని విమర్శించారు. వైద్య సదుపాయాలు లేనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా మెడికల్ కాలేజీ మంజూరు చేసినట్లు ప్రచారం, చేసుకుంటుందన్నారు. ప్రచార ఆర్భాటంలో భాగంగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ కి భవనాలు అందుబాటులోకి రాకపోవడంతో, మెడికల్ కౌన్సిల్ బోర్డు ఆసుపత్రి వైద్య సేవలు రద్దు చేశారని, దీనితో ఏలూరు జిల్లా ఆసుపత్రికి వస్తున్నటువంటి వేల సంఖ్యలో రోగులకు వైద్యం అందడం లేదని ఆరోపించారు. ఆసుపత్రిలో 42 వైద్య పోస్టులు 350 బెడ్స్ రద్దు చేసి, వైద్యులను చింతలపూడి నూజివీడు జంగారెడ్డిగూడెం కైకలూరు దెందులూరు తదితర ప్రాంతాలకు బదిలీ చేయడంవల్ల,జిల్లా ఆసుపత్రిలో రోగులకు వైద్యం అందడం లేదన్నారు. మెడికల్ కాలేజీ ప్రారంభమైందా అనుకుంటే మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థులు పూర్తిగా జాయిన్ కాలేదని, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీలో ఉండవలసిన వైద్య ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు తదితర సిబ్బంది పూర్తిగా నియామకం కాకపోవడంతో స్పెషాలిటీ విభాగాల్లో మూడు యూనిట్లు చొప్పున ఉండవలసిన సిబ్బంది, ఒక్కొక్క యూనిట్ కి మాత్రమే ప్రస్తుతం అనుమతించడం జరిగింది. దానితో వేల సంఖ్యలో వస్తున్న రోగులకు వైద్యం అందుబాటులో లేకుండా పోయిందని విమర్శించారు. సిబ్బంది కొరతతో రోగులను, విజయవాడ గుంటూరు ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారని, అక్కడి వరకు వెళ్లలేని రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి అప్పులు పాలవుతున్నారని విమర్శించారు.ఆసుపత్రిలోని ఐసీయూ విభాగంలో ఫ్యాన్ పని చేయడం లేదని, ఫ్యాన్లు కావాలంటే ఇళ్ల నుండి తెచ్చుకోవాలని సిబ్బంది అక్కడి రోగులకు ఉచిత సలహాలు ఇస్తున్నారని, పలువురు రోగులు జనసేన నాయకులకు ఫిర్యాదు చేశారు. మెడికల్ కాలేజీ పూర్తి కావాలంటే మూడు నుండి ఐదు సంవత్సరాల సమయం పడుతుందని, అప్పటివరకు ఏలూరు ఏలూరు చుట్టుపక్కల ప్రజలు జిల్లాలను ప్రజలు అవసరమైన వైద్యం సంగతి ఏమిటి అని ప్రశ్నించారు. పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మారిందన్నారు. కనీసం పేద ప్రజలకు వైద్య సదుపాయాలు కూడా కల్పించని వైసిపి ప్రభుత్వం నాయకులు మేల్కొని పేద ప్రజలకు వైద్య సేవలు అందే విధంగా స్థానిక శాసనసభ్యులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జిల్లా ఆసుపత్రిలో రద్దయిన 42 మంది స్పెషలిస్టు వైద్య పోస్టులు,350 బెడ్స్ ను పునరుద్ధరించాలని, ఏలూరులో ఏరియా ఆసుపత్రిని కనీసం 150 పడకలతో ఏర్పాటు చేయాలని, మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు పూర్తిస్థాయి అనుమతులు వేగవంతం చేసి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, ఏలూరు నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, నిమ్మల శ్రీను, కందుకూరి ఈశ్వరరావు, సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, తుమ్మపాల ఉమా దుర్గ, జనసైనికులు, వీరమహిళలు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.