అస్తవ్యస్తంగా ఉన్న వేణుంబాక రహదారిని పరిశీలించిన రోసనూరు సోమశేఖర్

సూళ్లూరుపేట: జనసేన పార్టీ దొరవారి సత్రం మండలం ఉపాధ్యక్షుడు యల్లంపాటి రిషి మరియు ప్రధాన కార్యదర్శి మణి ఇచ్చిన సమాచారం మేరకు మంగళవారం సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ యువనేత రోసనూరు సోమశేఖర్ వారితో కలసి వేణుంబాక గ్రామం వెళ్లే రోడ్డును పరిశీలించగా హైవే నుంచి పాలెంపాడు మీదుగా వేణుంబాక గ్రామం వెళ్లే రోడ్డు చాలా అధ్వానంగా అస్తవ్యస్తంగా తయారయింది. దారి పొడవునా పెద్ద పెద్ద గుంతలతో ప్రయాణికులకు చాలా అసౌకర్యంగా తయారైందని అభివృద్ధిపై నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ వైసీపీ పాలనపై సోమశేఖర్ అసహనం వ్యక్తపరిచారు. అలానే వేనుంబాక జనసైనికులను కలిసి రోడ్డు గురించి అధికారులతో చర్చిద్దామని హామీ ఇచ్చారు. అధికారులను ఉద్దేశించి వేణుంబాక రోడ్డు విషయంలో చొరవ తీసుకోవాలని వారిని అభ్యర్ధించారు. అలానే జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసే దిశగా మొదలుపెట్టిన మన ఇల్లు – మన జనసేన కార్యక్రమం గురించి వివరించారు. అదేవిధంగా గతంలో పాలెంపాడు గ్రామంలో వీధిలైట్లు సమస్య మరియు కరెంటు పోలు పడిపోయే పరిస్థితిలో ఉంది, ఆ ప్రాంతంలో పసిపిల్లలు తిరుగుతూ ఉంటారు అని స్థానికులు తెలియజేయగా ఏ.ఈ కి మరియు సెక్రటరీ కి ఫోన్ కాల్ చేసి సమస్యలను పరిష్కరించవలసిందిగా జనసేన తరపున సోమశేఖర్ అభ్యర్థించారు. వెంటనే స్పందించి సమస్య పరిష్కరిస్తామని బదులిచ్చిన అధికారులు ఇరువురికి ధన్యవాదాలు తెలియజేశారు.