నాదెండ్ల మనోహర్ ని విమర్శించే నైతిక అర్హత వైసీపీ నేతలకు లేదు

  • పవన్ కళ్యాణ్ కు కొండంత అండగా ఉండటంతో మనోహర్ లక్ష్యంగా వైసీపీ నేతల విమర్శలు
  • మాటలు మినహా చేతలు లేని అసమర్ధ మంత్రి అంబటి
  • ప్రసన్న కుమార్ రెడ్డిని చెప్పుతో కొట్టేందుకు పవన్ కళ్యాణ్ రానవసరం లేదు.. ప్రజలు సిద్ధంగా ఉన్నారు
  • రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టిన బ్రోకర్లు ఎవరో ప్రజలకు తెలుసు
  • జనసేన వ్యూహాత్మక ఎత్తులతో వైసీపీ నేతల్లో ఓటమి భయం
  • జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: వైసీపీ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతున్న జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్ ని విమర్శించే అర్హత మాటల మాయావి జలవనరుల శాఖామంత్రి అంబటి రాంబాబుకి లేదని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. నాదెండ్ల మనోహర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి రాంబాబుతో పాటూ వైసీపీ నేతలపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారమదంతో కొట్టుమిట్టాడుతున్న వైసీపీ నేతలకు మంచిబుద్ది ప్రసాదించమని శ్రీనివాసరావుతోటలోని స్వాతంత్ర్య సమరయోధులు కన్నెగంటి విగ్రహానికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ మాటల్ని కోటలు దాటించి చేతల్ని గుమ్మం కూడా దాటించలేని అంబటి రాంబాబు జనసేన నేతలపై విమర్శలకు దిగటం సిగ్గుచేటన్నారు. వైసీపీ విముక్త ఆంద్రప్రదేశ్ స్థాపనే ధ్యేయంగా పోరాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కొండంత అండగా నాదెండ్ల మనోహర్ నిలవటం వైసీపీ నేతలకు కంటకింపుగా మారిందన్నారు. తనని గెలిపంచిన నియోజకవర్గ ప్రజలకు , చేపట్టిన పదవికి న్యాయం చేయలేని అంబటి రాంబాబుకి శాసనసభ్యుడిగా తెనాలి అభివృద్ధిపై తనదైన ముద్ర వేసుకున్న మనోహర్ ని విమర్శించడం రాంబాబు రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. 294 మంది శాసనసభ్యులు కలిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సభాపతిగా నాదెండ్ల మనోహర్ వ్యవహరించిన హుందాతనమైన తీరు తెలుగు ప్రజలు ఎప్పటికి మరచిపోరన్నారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి వైసీపీకి కంటకునుకు లేకుండా చేస్తున్నాడనే నాదెండ్ల మనోహర్ పై అంబటి రాంబాబు , వైసీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి నోటి దురుసు మాటలు మాట్లాడితేనే దేవినేని నెహ్రూ అతని అనుచరులు రాంబాబుని తన్ని తరిమేసిన విషయం అందరికి తెలిసిందేన్నారు. చనిపోయిన వారికిచ్చే సహాయనిధిలో వాటాలు అడగటం, మహిళలతో గంటా, అరగంట అంటూ అసభ్యకరంగా మాట్లాడటం, మైనింగ్ లో, ఇసుకలో వాటాలు అడగటం వంటివి అంబటికే సరిపోతాయని విరుచుకుపడ్డారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అంటూ మళ్ళీ పాత పాటే పాడుతుతున్నారని విమర్శించారు. నడిరోడ్డుపై నిలుచుంటా పవన్ కళ్యాణ్ చెప్పుతో కొట్టేందుకు రావాలంటూ సవాల్ విసిరిన ప్రసన్న కుమార్ రెడ్డిని కొట్టేందుకు పవన్ కళ్యాణ్ అవసరం లేదని ప్రజలే చెప్పుకి అశుద్ధం రాసి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నాలుగేళ్లుగా ప్రజాధనాన్ని దోచుకుంది చాలని ఇప్పటికైనా ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పరిపాలన చేయాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. జనసేన వ్యూహాత్మక అడుగులతో వైసీపీ నేతల్లో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనపడుతుందన్నారు. వైసీపీ అరాచక, దాష్టీక పాలన నుంచి ఆంద్రాని రక్షించేందుకు జనసేన తీసుకునే ఎలాంటి నిర్ణయాలకైనా ప్రజా మద్దతు పూర్తిస్థాయిలో లభిస్తుందని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నగర కార్యదర్శిలు బండారు రవీంద్ర, మెహబూబ్ బాషా, డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, పగిడిపోగు రమేష్, సయ్యద్ రఫీ, నండూరి స్వామి, దాసరి రాము తదితరులు పాల్గొన్నారు.