జనసేన పేరుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులపై కేసు నమోదు

జనసేన పార్టీ పేరుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది. వివరాలలోనికివెళితే..
రాఘవేంద్ర ప్రైవేట్ ఫైనాన్స్ రాజమండ్రి 6303209022 ఈ ఫోన్ నెంబర్ తో జనసేన పార్టీ అనే ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ ఫోటోను డిపి ఉంచి ఒక గంటలోనే రుణాలు మంజూరు చేస్తామని అందుకు 3800 ప్రాసెసింగ్ ఫీస్ అవుతుందని ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. జనసేన పార్టీ పేరుతో మోసం చేస్తున్న ఈ వ్యక్తులపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ సూచనలతో కంప్లైంట్ చేసిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నాయకులు బొలిశెట్టి వంశీకృష్ణ జనసేన పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు పి.ఆర్.కే కిరణ్, గంజి పవన్, మల్లేశ్వర్ రావు, దిలీప్ కుమార్, హనుమాన్, జనసేన పార్టీ విజయవాడ నగర ఉపాధ్యక్షులు వెన్నా శివశంకర్, కామల్ల సోమనాదం, నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ మోబినా.