బూతులు మాట్లాడే ఉపముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలి: డా. యుగంధర్ పొన్న

  • ప్రభాకర్ రెడ్డి పై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకోవాలి
  • గడపగడప కార్యక్రమం ప్రజల ఆర్తనాధాలు వినడానికి
  • మీ జులుం ప్రదర్శించడానికి కాదు
  • జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న

వెదురుకుప్పం మండలం, గంటా వారి పల్లిలో అక్రమ బైండ్ ఓవర్ కేసు బాధితుడు ప్రభాకర్ రెడ్డిని జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న పరామర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ గడప గడప కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామికి తన కష్టాలు చెప్పుకుంటే, వాటిని పరిష్కరించ కుండా అతనిపై అక్రమ బైండ్ ఓవర్ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గడపగడప కార్యక్రమం ప్రజల ఆర్తనాదాలు వినడానికా? లేక మీ జులుం ప్రదర్శించడానికా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక నిరుపేద సామాన్య పౌరుడు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధికి సమస్యలు చెప్పుకోలేనంత దారుణ పరిస్థితి నియోజకవర్గంలో నెలకొందని దుయ్యబట్టారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గడపగడప కార్యక్రమంలో మాట్లాడిన బూతుల కంటే, ప్రభాకర్ రెడ్డి ఏమి మాట్లాడలేదని ఈ సందర్భంగా తెలిపారు. ఉపముఖ్యమంత్రి పెనుమూరులో మాట్లాడుతూ నా కుటుంబంలో ఉన్న అవినీతిపరులను కూడా నేను వెలివేశానని చెప్పావు గాని వారి మీద ఇంత వరకు కేసు పెట్టలేదు. అవినీతిపరులైన వారి మీద ఎందుకు కేసు పెట్టలేదు? వారి మీద కేసు పెట్టే ధైర్యం లేదా? వారి మీద కేసు పెట్టక పోతే వారి అవినీతిలో మీకు భాగం ఉందని తెలిపారు. నీతి నిజాయితీ అని మాట్లాడే నువ్వు వారి మీద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. బూతులు మాట్లాడే ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిపై కేసు నమోదు చేయాలని వెదురు కుప్పం ఎస్సై కి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. ప్రభాకర్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకోవాలని తెలియజేశారు. నియోజకవర్గంలో బాధితుల గొంతును వినిపించ నివ్వండని, వారి బాధలు, కష్టాలను ఎన్నికైన ప్రజాప్రతినిధులకు చెప్పుకోనివ్వండని, అలా కుదరకపోతే బెదిరించడమే మీ పని అయితే ఆ పదవుల నుండి మీరు తప్పుకోండి, నియోజకవర్గంలో సమస్యలు ఏమైనా ఉంటే పక్కన నగిరి లో ఉన్న మంత్రి రోజాకి, పుంగునూరులో ఉన్న మంత్రి పెద్దిరెడ్డికి విన్నవించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షులు లాలాపేట పురుషోత్తం, సీనియర్ నాయకులు యతీశ్వర్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి కోలార్ వెంకటేష్ కుటుంబ సభ్యులు ఉన్నారు.