దళిత నాగరాజుపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలి

  • జిల్లా ఎస్పీకి అఖిలపక్షం ఆధ్వర్యంలో జనసేన ఫిర్యాదు..

శింగణమల నియోజకవర్గం: గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామంలో వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డిని దళిత నాగరాజు సమస్యలపై ప్రస్తావిస్తే సమాధానం చెప్పకుండా సాంబశివరెడ్డి ఆయన అనుచరులు హేళన చేస్తూ కులం పేరుతో ఆయనని దూషిస్తూ నెట్టివేసిన ఘటనపై సింగనమల నియోజకవర్గం లోని దళిత సంఘాల నాయకులు, జనసేన పార్టీ నాయకులు బాధిత నాగరాజుతో కలిసి అనంతపురంలోని స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అఖిలపక్షం తరఫున ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు చిన్న ఆంజనేయులు, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ, జనసేన పార్టీ మహిళా నాయకురాలు శశిరేఖ, జయమ్మ, నాగరాజు ముకుందాపురం గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ కి వివరించారు. ఎస్పీ స్పందిస్తూ దళిత నాగరాజు పై కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి నాగేంద్ర, దివే కృష్ణమూర్తి, పురుషోత్తం రెడ్డి, మూప్పురిక్రిష్ణ, మూలి శ్రీకాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు నాగార్జున, ఎస్సీ పరిరక్షణ పోరాట సమితి నాయకులు బండారు కుళ్ళయప్ప, ఎమ్మార్పీఎస్ నాయకులు రామాంజనేయులు, మండల అధ్యక్షులు తాతయ్య, ఎర్రి స్వామి, హుస్సేన్, అశోక్, దేవ రాయల్, సరిత, అనసూయ, జనసేన వీరమహిళలు, జనసేన నాయకులు పాల్గొన్నారు.