కరోనాతో ఆసుపత్రిలో చేరిన అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన మెగాస్టార్

కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న అభిమానికి ఫోన్ చేసి మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి అతడిలో ధైర్యాన్ని నింపారు తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలానికి చెందిన చిరంజీవి అభిమాని కరోనాతో కాకినాడలోని ఆసుపత్రిలో చేరాడు. విషయం తెలిసిన చిరంజీవి నేరుగా అతడికి ఫోన్ చేసి ధైర్యం నింపారు. చిరంజీవిని మాట్లాడుతున్నానని, ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు.

పెద్ద డాక్టర్‌తో మాట్లాడానని, త్వరగానే తగ్గిపోతుందని చెప్పారు. భయం వద్దని చెబుతూ అతడిలో మానసిక ధైర్యాన్ని నింపారు. అలాగే, ఆసుపత్రి ప్రధాన వైద్యుడితోనూ మాట్లాడి.. అభిమాని ఆరోగ్యంపై చిరంజీవి ఆరా తీశారు. అభిమాన నటుడు చిరంజీవి స్వయంగా తనకు ఫోన్ చేసి మాట్లాడడంతో అభిమాని ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.