కొత్తలంకలో జనసేన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, ముమ్మిడివరం మండలం, కొత్తలంక గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ 14 సంవత్సరాలలోపు పిల్లలకు చిల్డ్రన్స్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన కొత్తలంక జనసేన శ్రేణులను అభినందించారు. వైద్య పరీక్షలు చేయించుకున్న పిల్లలకు పితాని బాలకృష్ణ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జక్కంశెట్టి పండు, గొల్లకోటి వెంకన్న బాబు, కడలి కొండ, పితాని రాజు, గొల్లకోటి సాయిబాబు, సోడిశెట్టి నాగబాబు, దూడల స్వామి, గేదెల స్వరూప్, వంగా విజయ సితార, ముల్లేటి గోపి, పెద్దిరెడ్డిచిట్టి, దూడల రాము, నార్ని నవీన్, వాకపల్లి దొర, పిల్లా కళ్యాణ్, పిల్లా భాస్కర్, పొగాకు వీరబాబు తదితరులు పాల్గొన్నారు.