రాజంపేట జనసేన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

  • సిద్దవటం మండలంలో జనసేన ముగ్గుల పోటీ

రాజంపేట, సిద్దవటం మండలంలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ మరియు జనసేన పార్టీ నాయకులు అతికారి కృష్ణల ఆధ్వర్యంలో సిద్ధవటం బద్వేల్ ప్రధాన రహదారి నందు భారీ స్థాయిలో ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు. దాదాపుగా 167 మంది మహిళలు పాల్గొన్న ఈ పోటీలలో మొదటి బహుమతిగా ఒంటిమిట్ట మండలానికి చెందిన విజయలక్ష్మికి 30 వేల రూపాయలు, రెండవ బహుమతి సిద్ధవటం మండలానికి చెందిన విజయశాంతికి 20వేల రూపాయలు, మూడవ బహుమతిగా సుబ్బలక్ష్మి, అబిత అనే ఇద్దరు మహిళలకు 10,000 రూపాయలు న్యాయ నిర్ణీతలు విజేతలుగా ఎంపిక చేశారు. విజేతలుగా ఎన్నికైన మహిళలకు నగదును జనసేన పార్టీ జిల్లా కో-ఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్, రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ రాజంపేట జనసేన పార్టీ నాయకులు అతికారి కృష్ణల చేతులమీదుగా అందజేశారు. పోటీలలో పాల్గొన్న మిగతా మహిళలకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరిగింది.

  • సుండుపల్లి మండలంలో జనసేన ముగ్గుల పోటీ

రాజంపేట, టి.సుండుపల్లి మండలంలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ మరియు జనసేన పార్టీ నాయకులు అతికారి కృష్ణల ఆధ్వర్యంలో టి సుండుపల్లి లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు భారీ స్థాయిలో టి సుండుపల్లి మరియు వీరబల్లి వీరమహిళల ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు. దాదాపుగా 150 మంది మహిళలు పాల్గొన్న ఈ పోటీలలో మొదటి బహుమతిగా 30 వేల రూపాయలు, రెండవ బహుమతి 20వేల రూపాయలు, మూడవ బహుమతిగా 10,000 రూపాయలు న్యాయ నిర్ణీతలు ఎంపిక చేశారు. విజేతలుగా ఎన్నికైన మహిళలకు నగదును రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ రాజంపేట జనసేన పార్టీ నాయకులు అతికారి కృష్ణ గార్లు చేతులమీదుగా అందజేశారు పోటీలలో పాల్గొన్న మిగతా మహిళలకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుండుపల్లి, వీరబల్లి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.