చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రాం కు ఘన నివాళులు

మంగళగిరి: స్వతంత్ర సమరయోధులు, నవభారత సమాజ నిర్మాత, భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రాం 36వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, మంగళగిరి – తాడేపల్లి జనసేన పార్టీ కోఆర్డినేటర్ మునగపాటి వెంకట మారుతీ రావు, మంగళగిరి పట్టణ అధ్యక్షులు షేక్ కైరుల్లా, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు శెట్టి రామకృష్ణ, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జె ఎస్ ఆర్), మంగళగిరి నియోజకవర్గం సీనియర్ నాయకులు సుందరయ్య, సీనియర్ నాయకులు నారాయణ, జొన్నాదుల పవన్ కుమార్, షేక్ వజిర్ భాష, బేతపూడి వంశీ తదితరులు పాల్గొన్నారు.