తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి

కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం, పామర్రు లోని చెట్లవానిపురం దగ్గర జనసేన ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో భారత దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించటం జరిగింది. ఈ సందర్భంగా తాడిశెట్టి నరేష్ మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడు అనేక మంత్రి పదవులు చేసి అణగారిన వర్గాలకు, అంటారని తనం నిర్ములనకు కృషి చేసిన మహా నాయకుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాపర్ల ఎంపీటీసీ సభ్యులు కూనపరెడ్డి సుబ్బారావు, పామర్రు మండల ఉపాధ్యక్షులు రాయవరపు శ్రీనివాసరావు, పామర్రు మండల ప్రధాన కార్యదర్శి మంచాల అనిత, కిట్టు, చెట్ల వాణిపురం గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.