మునగాల గ్రామ ఉపాధి హామీ రైతుకూలిలతో “గురుదత్”

  • జనసేన జనజాగృతి యాత్ర 61వ రోజు

రాజానగరం: జనసేన జనజాగృతి యాత్ర 61వ రోజులో భాగంగా రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, మునగాల గ్రామ ఉపాధి హామీ పని చేస్తున్న రైతుకూలిలను ఉదయాన్నే స్వయంగా వారి దగ్గరకి వెళ్ళి వారి సమస్యలు, వారి గ్రామంలో ఉన్న ఇబ్బందులు, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ రైతులకు చేసిన మేలుగురించి రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా మునగాల గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. చుట్టూపక్కల గ్రామల కన్నా మా మునగాల గ్రామ ఉపాధి హామీ కూలి చాలా తక్కువ పడుతున్నాయి అవి, రాకపోకలకు ఖర్చు అయ్యిపోతున్నాయి, అలానే గ్రామంలో మంచినీటి కోనేరు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆ కోనేరుని శుభ్రం చేస్తాం.. చేస్తామని చేయటంలేదు. జనసేన పార్టీ తరపున మాకు అండగా ఉండాలని ఇంచార్జ్ ని కోరారు. జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ మాట్లాడుతూ… జాతీయ ఉపాధి హామీ పథకం (మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ ఆక్ట్ ఎంజైరేగా) ఉపాధి హామీ కూలీలకు 200పైన ప్రభుత్వం వేతనాలు చెల్లించాలని, కానీ మునగాల గ్రామ ఉపాధి హామీ రైతు కూలీలకు 100,150 పడడం అనేది ఏంటి ఈ సమస్యపై పూర్తి స్థాయి అవగాహన రావాలి అంటే నియోజకవర్గం అంతటా తిరిగి ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకుని ఒక నివేదిక జనసేన పార్టీ తరపున ఎం.డి.ఓ ఆఫీస్ లో సమర్పిస్తామని ప్రజలకు తెలియజేసారు అలానే గ్రామ మంచినీటి కోనేరు సమస్య జనసేన పార్టీ ఆధ్వర్యంలో అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ 400మంది రైతుకూలిలకు మజ్జిగ పంపిణి & ఒక జనసేన పార్టీ గాజు గ్లాసు ప్రతి ఒక్కరికీ మేడ గురుదత్ ప్రసాద్ ఇచ్చారు. ఈ కార్యక్రమం కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, సీతానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, కోరుకొండ మండల జనసేన పార్టీ కో-కన్వీనర్ ముక్క రాంబాబు, చదువు ముక్తేశ్వరరావు, గేదల సత్తిబాబు, తెలగంశెట్టి శివ, తన్నీరు తాతాజీ, మండపాక మురళి, వల్లేపల్లి రాజేష్, పెద్ద కాపు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.