ప్రతి లబ్ధిదారునికి ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిందే: దోమకొండ అశోక్

విజయవాడ: జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా నున్న గ్రామంలోని జగనన్న కాలనీని జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులతో కలిసి దోమకొండ అశోక్ సందర్శించారు. ఈ సందర్భంగా దోమకొండ అశోక్ మాట్లాడుతూ
ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం ఇంటిని నిర్మించి అందించాల్సిందే అని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈజగనన్న కాలనీలో ఎక్కడ చూసినా మొండిగోడలు దర్శనమిస్తున్నాయని, అక్కడక్కడ జరిగిన నిర్మాణాలు కూడా నాసిరకంగా ఉన్నాయన్నారు. వాటిని పూర్తి చేసి ఇచ్చినప్పటికీ ఎంతోకాలం మన్నికలో ఉండవన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగ న్మోహన్ రెడ్డి 30 లక్షల గృహాలు నిర్మించి ఇస్తానని, అందులో మహిళల పేరిట వాటిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పి మహిళలను మోసం చేశారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి గారు ప్యాలెస్ లో ఉంటూ పేదవారు అద్దె కట్టుకుంటూ ఇబ్బందులు పడుతుంటే పైశాచిక ఆనందం పొందుతున్నట్టు ఉన్నారు, మొదటిగా ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తానన్న ఈ వైసిపి ప్రభుత్వం మాట మార్చింది. ఇప్పుడు ఎవరి ఇల్లు వారే కట్టుకోవాలి అంటే పేద ప్రజల కు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది.? ఆడబిడ్డలు వారి తాళిబొట్లను తాకట్టుపెట్టి ఇల్లు కట్టుకునే దుస్థితి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని, ప్రజలు నిలదీసే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్న, జగనన్న కాలనీలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. డ్రైనేజీ లైన్ లేవు, మంచినీటి సౌకర్యం లేదు, రోడ్లు మార్గాలు లేవు, కరెంటు సరఫరా లేదు, కనీసం సిగ్నల్ కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య సామాన్యుడి సొంత ఇంటి కల ఇంకెప్పుడు నెరవేరుతుంది. ఒకపక్క చూస్తే సగం కట్టుకొని డబ్బులు లేక మొండి గోడల దర్శనమిస్తున్నాయి. ఈ జగనన్న కాలనీలు గంజాయి తాగే బాబులకు గంజాయి హబ్ గా, తాగుబోతులకు బార్లుగా అడ్డాగా మారాయి. జగనన్న కాలనీ బాధితులకు జనసేన పార్టీ అండగా నిలబడుతుంది. జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదవాడి సొంత ఇంటి కలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తారు, జనసేన ప్రభుత్వమే పేదలకు ఇల్లు కట్టింగ్ చేస్తుంది, జనసేన ప్రభుత్వం స్థాపించింది పేదల కష్టాలు తీర్చడానికేనని దోమకొండ అశోక్ తెలియజేశారు.