తొలి వన్డేలో టీమిండియా ముందు 375 పరుగుల భారీ టార్గెట్..

సిడ్ని వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. తొలి మ్యాచ్‌లోనే ఆసీస్ బ్యాట్స్‌మెన్లు.. భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై చెలరేగి ఆడారు. కెప్టెన్ ఫించ్, మాజీ జట్టు సారథి స్టీవ్ స్మిత్ సెంచరీలతో వీరవిహారం చేశారు. దీంతో టీమిండియా ముందు 375 పరుగుల భారీ టార్గెట్ ను పెట్టింది.

కంగారూ బ్యాట్స్ మెన్ లు విరుచుకుపడటంతో టీమిండియా బౌలర్లు వణికిపోయారు. దీనికితోడు చెత్త ఫీల్డింగ్ కూడా ఆసీస్ భారీ స్కోరుకు కారణమైంది. స్మిత్ కేవలం 62 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 66 బంతుల్లో 105 పరుగులు చేయగా.. కెప్టెన్ ఫించ్ 124 బంతుల్లో 114 పరుగులు చేయగలిగాడు. మధ్యలో మ్యాక్స్‌వెల్ విధ్వంసం చేయడంతో కేవలం 19 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు.