అమెరికాలో మరో భారత సంతతి మహిళకు కీలక పదవి

వాషింగ్టన్‌: అమెరికాలో మరో భారత సంతతి మహిళకు కీలక పదవి దక్కింది. ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ మొదటి వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా భారత సంతతి మహిళ నౌరిన్‌ హసన్‌ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఫెడరల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ ప్రకటనలో తెలిపింది. నౌరీన్‌ హాసన్‌ తల్లిదండ్రులు కేరళ వాసీయులు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టా పొందిన ఆమెకు ఫైనాన్షియల్‌ సర్వీస్‌ రంగంలో నౌరీన్‌ హాసన్‌కు 25 ఏళ్ల అనుభవం ఉంది. ఆమె ఎన్నికను గవర్నర్స్‌ బోర్డు ఆమోదించింది. ఆమె నియామకం ఈ నెల 15 నుంచి అమల్లోకి రానున్నట్లు న్యూయార్క్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ జాన్‌ విలియమ్స్‌ తెలిపారు. ఆమెతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.