వికలాంగులకు పెన్షన్ పెంచాలని కోరుతూ మీడియా సమావేశం

భైంసా, వికలాంగులకు 10 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి అని సోమవారం భైంసా పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ దగ్గర వికలాంగులకు పెన్షన్ పెంచాలని కోరుతూ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వికలాంగుల జిల్లా నాయకులు బురుగుల రాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమం పూర్తిగా మరిచారు అన్నారు. వికలాంగులకు నెల నెల పెన్షన్ సరైన సమయంలో అందడం లేదు. సదరం క్యాంప్ లో కేవలం 50 టోకెన్లు మాత్రమే ఇవ్వడాన్ని చాలా తీవ్రంగా ఖండించారు. జిల్లాలో చాలా మంది వికలాంగుల క్యాంపు సమయంలో టోకెన్లు అందక నిరాశతో వెనుదిరిగి పోతున్నారు. కాబట్టి ప్రభుత్వం నెల నెల సదరం క్యాంప్ నిర్వహించి, కనీసం 200 మందికి అవకాశం కల్పించాలని అన్నారు. అదేవిధంగా అర్హులైన కొందరి వికలాంగుల సర్టిఫికెట్స్(అసెస్మెంట్) రిజెక్ట్ అయ్యాయి వాటిని వెంటనే మళ్ళీ పునః పరిశీలన చేసి వారికి మళ్ళీ అవకాశం కల్పించాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వంద శాతం వున్న వికలాంగులకు 10 వేల పెన్షన్ ఇవ్వాలి. మిగితా వారికి 6 వేలు, పెన్షన్, బస్ పాస్ లు, రైల్వే పాసులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జన సేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు పాల్గొన్నారు.