రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత

ప్రకాశం జిల్లా: కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ నుండి పాకల వెళ్ళు రహదారి గత కొన్ని సంవత్సర కాలం నుండి రోడ్లు దెబ్బతిని ద్విచక్ర వాహనదారులకు, ఆటోలు, స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, నిత్యం ఇబ్బందులు గురి అవుతున్నారు. సింగరాయకొండ పాకాల రోడ్డు అద్వానంగా ఉన్న రోడ్డులో ప్రయాణించలేక సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు విన్నవించుకున్న మరమ్మతులు చేపడతామని తెలుపుతున్నారే తప్ప మరమ్మత్తులను ప్రారంభించడం లో మీనమేషాలు లెక్క పెడుతున్నారు. పాకాల రోడ్డు నిత్యం రద్దీగా ఉండే రోడ్డు ఈ రోడ్డు నుంచి విద్యార్థులు పాఠశాలకు, ఉద్యోగస్తులు విధులకు, నిత్యవసరాలు కొనుగోలు చేసేందుకు సామాన్యులు, ఈ రోడ్డు గుండా నే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రోడ్డు దుస్థితి అధ్వానంగా ఉండటంతో ఈ రోడ్డు గుండా ప్రయాణించేవారు ప్రమాదాలకు గురి ఆసుపత్రి పాలు అవుతున్నారు. ఈ విషయాన్ని అధికార పార్టీ నేతలకు ఉన్నతలు ద్వారా విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయింది. మరమ్మతులు చేపడతామని తెలుపుతున్నారు తప్ప ఆచరణలు మాత్రం శ్రద్ద వహించడం లేదు. ఈ సమస్యను సోమవారం నాడు పంచాయతీరాజ్ జేఈ శ్రీహరి దృష్టికి తీసుకొని పోగా.. జేఈ సింగరాయకొండ నుండి పాకాల రోడ్డు సాంక్షన్ అయ్యింది త్వరలోనే రోడ్డును నిర్మిస్తాము అని తెలిపారు. జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, మండల నాయకులు కాసుల శ్రీనివాస్ అనుముల శెట్టి కిరణ్ బాబు గుంటుపల్లి శ్రీనివాస్ సంకే నాగరాజు వాయిల చిన్న మరియు జన సైనికులు పాల్గొన్నారు.