పవర్ స్టార్ కు అరుదైన గిఫ్ట్

టాలీవుడ్ లో పబ్లిసిటీ డిజైనర్స్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనీల్ అండ్ భాను లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఓ పబ్లిక్ మీటింగ్ లో పవన్ నిలుచుకుని ఉన్న ప్రొఫైల్ పోస్టర్ ను డిజైన్ చేశారు. పవర్ స్టార్ బర్త్ డే రోజు ఇది ఇవ్వాలని అనుకోగా అది కాస్త లేట్ అయినట్టు తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలిసి ఈ పోస్టర్ ను అందించారు అనీల్ అండ్ భాను.

ఇక ఈ పోస్టర్ ను పవర్ స్టార్ తన ఇన్ స్టాగ్రాం ద్వారా షేర్ చేశారు. పవన్ కళ్యాణ్ పోస్టర్ తో అనీల్ అండ్ భాను ఆయన మీద అభిమానాన్ని చూపించారు. తెలుగులో చాలా సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్స్ గా ఉంటున్న అనీల్ అండ్ భాను పవన్ కోసం చేసిన ఈ పోస్టర్ చాలా స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది.