గళావెల్లి గ్రామంలో రీ సర్వే చేయాలి

  • పెద్ద చెరువు కబ్జాను అరికట్టాలి
  • పోలీసుల వేధింపులు లేకుండా చేయాలి
  • కబ్జాకు గురైన అర్చకుని ఇంటి స్థలాన్ని అప్పగించాలి
  • బాలగుడబ గ్రామంలో జరుగుతున్న గోవధ పై చర్యలు చేపట్టాలి
  • కృష్ణపల్లి చంద్రన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: బలిజిపేట మండలం, గళావెల్లి గ్రామంలో రీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను కలిసిన జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, గుంట్ రెడ్డి గౌరీ శంకర్, బలిజిపేట మండల అధ్యక్షులు బంకురు పోలి నాయుడు, గంటేడా స్వామి నాయుడు, రఘుమండల అప్పలనాయుడు, నారాయణపురం ఆదినారాయణ, మామిడి మార్కండేయులు తదితర గ్రామస్తులు మాట్లాడుతూ బలిజిపేట మండలం గళావెల్లి గ్రామానికి చెందిన సమస్యలను ప్రస్తావించారు. బలిజిపేట మండలం గళావెల్లి గ్రామంలో ఇప్పటివరకు ప్రభుత్వం రీ సర్వీ చేపట్టలేదన్నారు. అక్కడ రీ సర్వే చేపడితే ఓ నాయకుడి కబ్జా గోతం బట్టబయలవుతుందన్నారు. అలాగే గ్రామంలోని పెద్ద చెరువు కబ్జాకు గురవుతోందన్నారు. తక్షణమే కబ్జాలు నిలుపుదల చేసి కబ్జాకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గ్రామంలోని దేవాలయ అర్చకులు సాయికుమార్ పంతులు ఇంటి స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆ స్థలాన్ని సాయికుమార్ కు అప్పగించాలన్నారు. అలాగే ప్రశ్నించినవారిపై, ఫిర్యాదు చేసిన వారిపై బలిజిపేట మండల పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారన్నారని ఆరోపించారు. రాజకీయ వ్యక్తుల వత్తిళ్లకు తలొగ్గి ఫిర్యాదు ఇచ్చిన వారిపై కేసులు పెడుతూ వేధిస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల శ్రమని జీతాలుగా తీసుకున్న అధికారులు పాలకులకు పని మనుషుల్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఆయా సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పార్వతీపురం మండలంలోని కృష్ణ పల్లి గ్రామంలో ఉన్న చంద్రన్న కాలనీలో రోడ్లు కాలువలు తాగునీరు విద్యుత్ సదుపాయం తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని గ్రామస్తులు తో పాటు కోరారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్ కు వినతి పత్రాలు అందజేస్తారు. అనంతరం పార్వతీపురం మన్యం జిల్లా బిజెపి అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాస్ రావుతో కలిసి ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. బాలగుడబ గ్రామంలో జరుగుతున్న గోహత్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *