పిఠాపురంలో అధికార పార్టీకి గట్టి షాక్ – దూసుకుపోతున్న మాకినీడి..!

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు మండలంలో అత్యధిక ఓటర్లు కలిగిన గ్రామం దుర్గాడ. అలాంటి గ్రామం నుండి వైసీపీ రాక్షసత్వ రావణపాలన భరించలేక జనసేన సిద్ధాంతాలకి ఫిదా అయి దుర్గాడ గ్రామం-3 నుండి అధికార పార్టీ ఎంపిటీసిగా ఎన్నికైన జ్యోతుల శ్రీనివాస్ ఇటీవల వైసీపికు రిజైన్ చేసారు. పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకీనీడి శేషుకుమారి వారి ఇంటికి వెళ్ళి నాయకుల సమక్షంలో శాలువా కప్పి, అభినందించి సాదరంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఎంతమంది లీడర్స్ ఉన్నారన్నది కాదు ఇలాంటి చేరిక ఎవరివలన అవుతుందనేదే ముఖ్యం అని శ్రీనివాస్ అన్నారు. పార్టీ కోసం అహర్నిశలూ జనసేన పార్టీ ఇంచార్జితో కలిసి కస్టపడతానని హామీ ఇచ్చారు. మాకీనీడి తీయ్యనిపలకరింపు అపారమైన ఆప్యాయత కల్మషం లేని కలుపుగోలుతనంతో పార్టీ ఆదేశాల మేరకు దూసుకుపోతున్న ఆమె ఆహ్వానాన్ని మన్నించి పార్టీలోకి రావడానికి శ్రీనివాస్ మనస్ఫూర్తిగా అంగీకరించారు. గతంలో వార్డు మాజీ కౌస్సలర్స్ మాజీ మున్సిపాలిటీ చైర్మన్ ఇతరపార్టీ ప్రజాప్రతినిధులు చేరిక శేషకుమారి చాకచాక్యమైన పనితనంకు నిదర్శనంగా, పవన్ కళ్యాణ్ ఆశయాలకు మాకీనీడి శేషకుమారి నడిపించే తీరుకు ఆకర్షణీయమై పార్టీ తీర్దం పుచ్చుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని చేరికలుంటాయని, పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా తమ చర్యలు ఉంటాయని, జనసైనుకులు, వీర మహిళలు, నాయకుల సహకారంతో పిఠాపురంలో జనసేన జండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేసారు. శ్రీనివాస్ తో పాటు వారి అనుచరులు త్వరలోనే పార్టీ కండువాలు కప్పుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల పెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, వార్డు నంబూరు గొల్లపల్లి గంగ, వెలుగుల లక్ష్మణ్, శాఖ సురేష్ బాబు, గొల్లపల్లి నరసింహులు, కోలా నాని మరియు జనసైనికులు, నాయకులు పాల్గొన్నారు.