నేడు ఏపీలో మహిళా భద్రతకు ‘అభయం’ యాప్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘అభయం’ యాప్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి గూడెంలోని క్యాంపు కార్యాలయంలో ఈ యాప్ ను వర్చ్ వల్ గా మొదలుపెట్టనున్నారు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తగా ‘అభయం’ అనే ప్రాజక్టును అమలు చేయబోతున్నాయి. ఆటోలు, క్యాబల్ లలో ప్రయాణించే మహిళలకు అవాంఛనీయ ఘటనలు ఎదురైతే వారు ప్రయాణించే వాహనం ఎక్కడుందో తెలుసుకుని పట్టుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.138.48 కోట్లు కాగా.. కేంద్రప్రభుత్వం 58.64 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం మిగతా మొత్తాన్ని సమకూర్చనుంది. దశలవారీగా రాష్ట్రంలో లక్ష రవాణా వాహనాలకు ట్రాకింగ్ డివైజ్ లు బిగించి వచ్చే ఏడాది నవంబర్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించారు.