నేటి నుంచే నామినేషన్ల పర్వం

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మెరుపు వేగంతో పూర్తి కానున్నాయి. తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థ సారధి షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్ కూడా ప్రకటించారు. ఈరోజు నుంచి జీహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకారం ప్రారంభం కాబోతున్నది. ఈరోజు నుంచి 20 వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. కేవలం మూడు రోజులు మాత్రమే నామినేషన్ల స్వీకరణ ఉండటంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు లిస్టులను ప్రకటిస్తున్నాయి. నవంబర్ 21 న పరిశీలన, 22న ఉపసంహరణ ఉంటాయి. కేవలం వారం రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉండటంతో అన్ని పార్టీలు ఒకవైపు అభ్యర్థులను ప్రకటిస్తూ, ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు సిద్ధం అవుతున్నాయి.