చిన్నారిని హత్య చేసిన కీచకడు ఆత్మహత్య..

నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి చైత్రను దారుణంగా హత్య చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం జనగాం జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో రైలు పట్టాలపై రాజు మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించి సమాచారం అందించారు. చేతిపై ఉన్న టాటును చూసి నిందితుడు రాజు మృతదేహంగా పోలీసులు గుర్తించారు. గత వారం రోజులుగా దాదాపు 1000మంది పోలీసులు గ్రూపులుగా ఏర్పడి రాజు కోసం గాలిస్తున్న విషయం తెలిసిందే.