రామోజీ ఫిల్మ్‌ సిటీలో శరవేగంగా “ఆచార్య” షూటింగ్‌

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాజల్ చిరంజీవికి జోడీగా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ నవంబర్ 20 నుంచి హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో జరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలోని ఓ పురాతన దేవాలయం సెట్‌లో నేటి నుంచి చిత్రీకరణ మొదలవగా.. మూవీలో కీలకమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కూడా ఇక్కడే షూట్‌ చేయనున్నారట. ఆచార్యలో దేవాలయాల పేరుతో జరుగుతున్న అవకతవకలపై పోరాటం చేసే ఎండోమెంట్‌ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా చిరు కనిప్తాడని తెలుస్తోంది. ఇక రాంచరణ్‌ నక్సలైట్‌గా కనిపించనున్నాడు.