పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి: యుగంధర్

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: కార్వేటి నగరం మండలం, ఆర్ కెవిబిపేట గ్రామపంచాయతీలో రెండు సంవత్సరాల క్రితం తుమ్మలచెరువుకి చేపల వేలం పాటలో ఒక లక్ష 97 వేల రూపాయలు పాడారు. ఒక లక్ష వెయ్యి రూపాయలు పంచాయితీకి కట్టారు. ఇంతవరకు మిగతా డబ్బులు అనగా 96 వేల రూపాయలు పంచాయతీకి జమకాలేదని జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ యుగంధర్ పొన్న స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయఒలో సీనియర్ అసిస్టెంట్ కృష్ణయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్ కే వి బి పేట పంచాయితీ ఆదాయానికి గండిపడిందని, ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారు? డబ్బు జమ చేయించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న పంచాయతీ కార్యదర్శి లోకేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇంకా జమ కాని సొమ్మును వెంటనే రాబట్టాలని, ఆర్కే వీబిపేట గ్రామంలో ఇటీవల తారు రోడ్డు మీద మట్టి పోశారని, ఆ రోడ్డు ఇంకా దయనీయంగా మారిందని, ఎందుకు తారు రోడ్డు మీద మట్టి పోశారు? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం దీనిని ప్రోత్సహించిన పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా తారు రోడ్డు మీద మట్టి పోసిన వారిపై చర్యలు తీసుకోవాలని యుగంధర్ కోరారు.