తుఫాన్ కారణంగా తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరా

సర్వేపల్లి నియోజకవర్గం: తోటపల్లి గూడూరు మండలం, కోడూరు పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరపాలెం గ్రామస్తులకి ఆదివారం తాగునీరు అందించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ తుఫాన్ కారణంగా కరెంటు స్తంభాలు పడిపోయాయి. తాగడానికి నీళ్లు లేక సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూడా ప్రజలు అవస్థలు పడుతుంటే ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కావచ్చు ఇంత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం దారుణం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో
తుఫాన్ కారణంగా ఇల్లు కూలిపోయయి, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. చాలా గ్రామాల్లో ప్రజలకు తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మూడు నెలల వ్యవధిలో అన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పట్టించుకుంటారా లేకపోతే ఈ ప్రభుత్వానికి ఇంకా 90 రోజులే గడువు తీరిపోతుంది. రాబోయే ప్రజా ప్రభుత్వంలో జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్న క్షణాల్లో ఆ సమస్యలను పరిష్కరించడానికి అడుగులు ముందుకు వేస్తాం. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలారా ఇకనైనా కళ్ళు తెరవండి, మాటల గారడి చేసే పాలకులను నమ్మవద్దు. మీకు ఎప్పుడు ఏ సమస్య ఉందన్న వెంటనే అందుబాటులో ఉండే నాయకులనే హక్కు అన్ని చేర్చుకొని వారినే ఆదరించండి. ఈ కార్యక్రమంలో వీరమహిళ గుమ్మినేని వాణి, భవాని, తోటపల్లి గూడూరు మండలం నాయకులు శరత్, వెంకటాచలం, మండల కార్యదర్శి శ్రీహరి, స్థానికులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.