అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలు, పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

  • జనసేన ఖమ్మం అసెంబ్లీ ఇంచార్జి మిరియాల రామకృష్ణ

ఖమ్మం నియోజకవర్గం: ఖమ్మం నగరంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని జనసేన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి మిరియాల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఖమ్మం కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, డిఈ ఓ సోమశేఖర్ శర్మకి వినతిపత్రం అందజేశారు. అనుమతులు లేకుండా ప్రైవేట్ పాఠశాలలు నడుపుతున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు అని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు బండారు రామకృష్ణ, ఖమ్మం నగర అధ్యక్షులు మెడబోయిన కార్తిక్, ప్రధాన కార్యదర్శి యాసంనేని అజయ్ కృష్ణ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బాణాల శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు వెల్లంకాండ ఉపేందర్, రఘునాధపాలెం మండల నాయకులు సఛ్చూ స్రవంత్ కన్న, జనసేన విద్యార్థి విభాగం నాయకులు గంగాధర్, విజయ్, రాకేష్, ఉదయ్ జనసైనికులు నరేంద్ర, విక్రమ్, శ్రవణ్, దుర్గ, లికేష్, వాసు, సాయి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.