రాయపాటి అరుణ పై అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలి: ఇమ్మడి కాశీనాథ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం: మార్కాపురం జనసేన పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడమైనది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ చార్జి ఇమ్మడి. కాశీనాథ్ మాట్లాడుతూ.. 20-6-22 వ తేదీన జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ పై అర్ధరాత్రి తప్పతాగి ఫోన్ లో అనుచితంగా ప్రవర్తించిన ఒంగోలు డివిజన్ స్థాయి వైసీపీ నాయకుడి యొక్క చర్యలు హేయమైనవి.. అతడిని సమర్థిస్తున్న సాటి మహిళ మేయర్ గంగాడ సుజాత తీరు అమానుషంగా ఉంది. మేయర్ మేయర్ గారూ.. మీ పార్టీ లో ఇటువంటి వ్యక్తులు ఉన్నందుకు సిగ్గుపడాలి. వెంటనే అతని పై క్రమశిక్షణ చర్యలు తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కానీ.. అతని చర్యలను సమర్ధిస్తున్న తమరు తిరిగి ఎస్ పి గారికి మీరు, మీ అనుచరులు ఫిర్యాదు చేయడం స్త్రీ జాతిని మీరు అవమాన పరిచినట్లుoది. మా రాయపాటి అరుణ షెడ్యూలు కావాలని అంత సరదాగా ఉంటే మేమే మీరు చెప్పిన చోటికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తామని హెచ్చరిస్తున్నాము. ఇటువంటి చర్యలు మరలా పునరావృతమైతే ప్రకాశంజిల్లా జనసేన పార్టీ కార్యకర్తలు, మహిళలు, చూస్తూ ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో.. జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాదిక్, జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, సంయుక్త కార్యదర్శి ఎన్. సురేష్, పట్టణ అధ్యక్షులు డా.ఇమాం సాహెబ్, తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, మార్కాపురం మండలపార్టీ అధ్యక్షులు తాటి. రమేష్, పేరూరి రమేష్, పోటు వెంకటేశ్వర్లు, ఖాజావలి, ఆదినారాయణ, దుగ్గి రామిరెడ్డి, పిన్నే బోయిన శ్రీనివాసులు, శేఖర్, ఎన్. రమణ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.