ప్రభుత్వ భూముల ఆక్ర‌మ‌ణ‌లపై చ‌ర్య‌లు తీసుకోవాలి: జనసేన

  • కొలిమిగుండ్ల మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి.. జనసేన వినతిపత్రం

బనగానపల్లె: కొలిమిగుండ్ల మండలంలో ప్రభుత్వ భూములను యదేచ్ఛగా కబ్జా చేస్తున్న ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని మండల తాసిల్దార్ ఆల్ఫ్రెడ్ కి బనగానపల్లె నియోజకవర్గ జనసేన నాయకుడు భాస్కర్ ఆధ్వర్యంలో కొలిమిగుండ్ల మండలం జనసేన నాయకులు పెద్దయ్య, పృథ్వి లతో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ మండలంలో కొందరు ఆక్రమణదారులు ఏదేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని బహిరంగంగా భూములు చదును చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు వారిని నిలవరించకపోతే భవిష్యత్ తరాల అవసరాలకు ప్రభుత్వ భూములు గజం స్థలం కూడా లేకుండా చేస్తారని కావున వాటిపై తాసిల్దార్ చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో జనసేన పార్టీ తరఫున పోరాటం చేయాల్సి ఉంటుందని కొండ ప్రాంతాలలో జింకలు, నెమల్లు మరియు ఇతర వన్యప్రాణులు జీవిస్తున్నాయని వాటి భవితవ్యం ప్రశ్నార్ధకంగా ఉందని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కావున అక్రమ దారులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని కొలిమిగుండ్ల తాసిల్దార్ ఆల్ఫ్రెడ్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొలిమిగుండ్ల జనసేన నాయకులు పెద్దయ్య, పృథ్వి, అవుకు మండల నాయకులు అజిత్ రెడ్డి, జనార్ధన్ జనసైనికులు ప్రతాప్, నారాయణ, మద్దిలేటి, ఏసన్న, కొత్త బోయిన నారాయణస్వామి, కళ్యాణ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.