క్రియశీలక సభ్యత్వ నమోదు కార్యచరణ సమీక్ష సమావేశం

కాకినాడ రూరల్: జనసేన పార్టీ ని అధికారం లోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మూడవ విడత పార్టీ క్రియశిలక సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి జన సేన నాయకులు, జనసైనికులు అడుగులు వేస్తున్నారని, కాకినాడ రూరల్ నియోజకవర్గం లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే నేను ఆయనకి జనరల్ ఏజెంట్ గా పనిచేసి, గెలిపిస్తానని తెలిపిన జనసేన పిఏసి సభ్యులు కాకినాడ రూరల్ ఇంఛార్జి పంతం నానాజీ. పంతం నానాజీ ఆధ్వర్యంలో విద్యుత్ నగర్ శ్రీ చల్ల జగన్నాథ శాస్త్రి కళ్యాణ మందిరంలో జనసేన నాయకులు కార్యకర్తలతో క్రియశీలక సభ్యత్వ నమోదు కార్యచరణ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల స్థాయి నూతన కార్యవర్గాన్ని, రూరల్ పరిధిలో గల 7 డివిజన్లకు చెందిన సిటీ కార్యవర్గసభ్యులతో నానాజీ ప్రమాణ స్వీకారం చేయించారు ముందుగా వివిధ ప్రమాదాల్లో అశువులు బాసిన జనసేన కార్యకర్తల్ని స్మరిస్తూ మౌనం పాటించారు. అనంతరం పంతం నానాజీ మాట్లాడుతూ గత రెండు మూడు రోజులుగా రాష్ట్రం లో పరిస్థితులు, వై.సి.పి శాసనసభ్యులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఏ సమయంలోనైన ఎన్నికలు వచ్చేలా పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఎపుడు ఎన్నికలు వచ్చినా జన సేన నాయకులు, కార్యకర్తలు సిద్దంగా ఉండాలని పిలుపు నిచ్చారు. నియోజవర్గ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల సమస్యలపై నిత్యం పోరాడాలని నాయకులు కు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ మండల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.