క్రియాశీలక సభ్యత్వంతో పార్టీలో ప్రాధాన్యత పెరుగుతుంది: నేమూరి శంకర్ గౌడ్

హైదరాబాద్, జనసేనపై కార్యకర్తలు ఎంత అంకితభావం కనబరుస్తారో కార్యకర్తల భద్రత పట్ల మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అంత కన్నా ఎక్కువ ఆలోచిస్తారు అనడానికి నిదర్శనం పార్టీ క్రియాశీలక సభ్యత్వం. కార్యకర్తల భద్రత గురించి, కార్యకర్త కుటుంబం భరోసా గురించి ఆలోచించిన దాఖలాలు ప్రపంచ రాజకీయ వ్యవస్థలోనే చాలా అరుదు. గతంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతీ ఒక్కరూ రెన్యువల్ చేసుకోవడానికి, కొత్తగా క్రియాశీలక సభ్యత్వం పొందడానికి ఇంకా ఒక్క వారం మాత్రమే సమయం ఉంది. కార్యకర్తలు మీ మీ నియోజకవర్గం పరిధిలో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నామని తెలంగాణా జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ అన్నారు.