ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

  • ఈ పుట్టినరోజు మాలో రాజకీయ స్ఫూర్తిని నింపింది
  • వచ్చేది జనసేన ప్రభుత్వమే- డాక్టర్ యుగంధర్

గంగాధర నెల్లూరు, కార్వేటి నగరం మండలంలో జనసేన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న ముఖ్యఅతిథిగా మండల నాయకులు, జనసైనికుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని మండలంలో గ్రామ గ్రామాల్లో పండుగ వాతావరణంలో జన్మదిన వేడుకలు జరిగాయి. కార్వేటి నగరం మండల కేంద్రం గాండ్ల మిట్ట కూడలి వద్ద, సుద్దగుంట గ్రామంలో, మరియు ఆర్కే విబి పేట పంచాయతీ రాజుల కండ్రిగ గ్రామంలో అశేష ప్రజానికం మధ్యన కేక్ కటింగ్ చేసి సహపంక్తి భోజనాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా యుగంధర్ పొన్న మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 51వ పుట్టినరోజు ప్రతి ఒక్క జన సైనికులలో ప్రతి ఒక్క జనసేన నాయకుల్లో వీర మహిళల్లో రాజకీయ స్ఫూర్తిని నింపింది, మా నాయకుడి పోరాటపటిమా, సేవా దృక్పథం, సమాజం మీద ఉండే ప్రేమ, ప్రతి ఒక్క జనసేన నాయకుల్లో స్ఫూర్తిని నింపింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, గౌరవ అధ్యక్షులు భానుచంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, లోకేష్ రాయల్, విజయ్, మాదాసి వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు హరీష్, నరేష్, కార్యదర్శులు శివ, యుగంధర్ రెడ్డి, సూర్య నరసింహులు, టౌన్ ప్రెసిడెంట్ రాజేష్, మండల నాయకులు రూప శేఖర్, చంద్ర, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జనసైనికులు పాల్గొన్నారు.