‘ఆది పురుష్’ రావణుడు ఎవరో చెప్పిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తొలి బాలీవుడ్ సినిమాను ప్రకటించాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌తో తొలి హిందీ సినిమా ‘ఆది పరుష్’ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే విలన్ ఎవరా అనే సస్పెన్స్‌కు ప్రభాస్ తెరదించాడు. ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తుండగా, లంకాధిపతి రావణుడి పాత్రను బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్  పోషిస్తున్నాడని అధికారికంగా ప్రభాస్ ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేశాడు.

7000 ఏళ్ల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడు ఉండేవాడని బుధవారం హింట్ ఇచ్చిన ప్రభాస్.. చెప్పిన ప్రకారంగానే గురువారం ఉదయం 7.11 గంటలకు ఆ ఇంటెలిజెంట్ విలన్, రావణుడుగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడని పోస్టర్ షేర్ చేశాడు.