జోరుగా జరుగుతున్న ‘ఆదిపురుష్’ షూటింగ్!

రామాయణం ఇతివృత్తంతో దర్శకుడు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. రాముడిగా ప్రభాస్ .. సీతగా కృతి సనన్ నటిస్తున్న ఈ సినిమాలో, రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. కరోనా కారణంగా అవరోధాలు ఎదురైనా, మళ్లీ రంగంలోకి దిగిన ఈ సినిమా టీమ్, జోరుగా షూటింగ్ జరుపుతోంది. ప్రస్తుతం రావణుడికి సంబంధించిన సన్నివేశాలను సైఫ్ అలీఖాన్ పై చిత్రీకరిస్తున్నారట. అంటే లంకానగర వైభవం .. ఆయన పరాక్రమానికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతోందన్న మాట.

ఈ సినిమా షూటింగులో ప్రభాస్ ఇంకా జాయిన్ కాలేదు. సైఫ్ అలీఖాన్ సోలో సీన్స్ చిత్రీకరణ పూర్తయ్యేలోగా, ‘సలార్’ షూటింగును పూర్తిచేసుకుని ప్రభాస్ వస్తాడని అంటున్నారు. ఆ తరువాత ‘అయోధ్య’ నేపథ్యంలో సాగే సన్నివేశాలను చిత్రీకరిస్తారని అంటున్నారు. కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సెట్టింగులు వేశారు. వీఎఫెక్స్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేయనున్నారు. బాలీవుడ్ లో పౌరాణిక నేపథ్యంలో ఇంతవరకూ వచ్చిన సినిమాలకు అగ్రస్థానంలో ఈ సినిమా నిలుస్తుందని దర్శక నిర్మాతలు చెప్పడం, అందరిలో మరింత ఆసక్తిని రేపుతోంది.