గని ‘ ఈశ్వర్ నాథ్ ‘ లుక్ రిలీజ్

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాక్సర్ గా వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. అలాగే అల్లు బాబి, సిద్దు ముద్ద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా నవంబర్ 15న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో నటిస్తున్న ముఖ్యమైన పాత్రలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు. నిన్న నదియా పాత్రను రివీల్ చేయగా నేడు జగపతిబాబు పాత్రను రివీల్ చేశారు.

ఈ సినిమాలో జగపతి బాబు ఈశ్వర్ నాథ్ పాత్రలో నటిస్తున్నాడు. జగపతి బాబు లుక్ గతంలో నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు సినిమాలో ఎలా ఉందో అలానే ఉంది. ఇకపోతే ఈ సినిమాను డిసెంబర్ 3న థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే.