రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్.. ఉత్తర్వులు జారీ

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్యనాథ్‌ దాస్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌ సెప్టెంబర్‌ 30న పదవీ విరమణ చేయనున్నారు. తర్వాత నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేబినెట్‌ మంత్రి హోదాలో న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌ కేంద్రంగా ఆదిత్యనాథ్‌ దాస్‌ పనిచేయనున్నారని జీఏడీ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వుల్లో తెలిపారు.