రీ నోటిఫికేషన్‌పై విచారణ వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రీ నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. జనసేన కార్యదర్శితో పాటు పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో నామినేషన్ల ప్రక్రియ సందర్బంగా అధికార పార్టీకి చెందిన వారు తాము నామినేషన్‌ వేయకుండా బలవంతంగా అడ్డుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై కౌంటర్‌ అఫిడవిట్‌ వేసేందుకు సమయం కావాలని ఎన్నికల సంఘం కోరింది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 8కి వాయిదా వేసింది.