పిఠాపురంలో జనసేన దూకుడు, జనసేనలోకి వలసలు వేగవంతం

  • తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొణిదల నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలోకి వివిధ పార్టీల నాయకుల చేరికలు
  • పార్టీ చేరికలు కార్యక్రమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్
  • తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ను నా కొడుకు లాంటి వాడని ప్రశంసించిన కొణిదల నాగబాబు
  • పిఠాపురంలో రోజు రోజుకు పెరుగుతున్న జనసేన పార్టీ గ్రాఫ్
  • భారీ మెజారిటీ దిశగా పిఠాపురం పీఠం దక్కించుకోవాలని నాగబాబు హితవు.
  • సీనియర్ నాయకులు చేరిక పట్ల హర్షం వ్యక్తం చేసిన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సోమవారం పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్బంగా నాగబాబు పార్టీ కండువా వేసి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ ఉన్నతి కోసం పూర్తిస్థాయిలో పని చేయాలని సూచించి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పిఠాపురం పీఠం మనదే అని, భారీ మెజారిటీ ఇచ్చి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి కానుకగా ఇద్దాం అని, వైసీపీ ప్రభుత్వ దాష్టీకాలపై తెగించి పోరాడాల్సిన సమయం వచ్చింది అంటూ కలిసికట్టుగా ముందుకు వెళదాం అని స్పష్టం చేశారు. జనసేనపార్టీలో క్రియశీలకంగా వ్యవహరిస్తున్న పిఠాపురం ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ని ప్రత్యేకంగా అభినందిస్తూ వరుణ్ తేజ్ లా ఉదయ్ కూడా నా సొంత కొడుకులాంటి వాడని మరియు చాలా దూరదృష్టితో ఆలోచించగలిగే సమర్ధుడని ప్రశంశిస్తూ, ఈ అవినీతి ప్రభుత్వం మీద జరిగే పోరాటంలో మీకు ఎల్లప్పుడూ అన్ని విధాలుగా అండగా జనసేన పార్టీ ఉంటుంది అని హామీ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని దేహి, దేహి అని అడగాల్సిన పరిస్థితి లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కులను, విధులను ఖచ్చితంగా వినియోగించుకుందాం. నియంత పాలన చేస్తామంటే కుదరదు అని తనను నమ్ముకున్న వారి కోసం చివరి వరకు నిలబడే నాయకులు, సమస్యలపై కడదాకా పోరాడేతత్వం ఉన్న మీ లాంటి నాయకుల బలమే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి అదనపు బలం చేకూరినట్లయింది అని అనందం వ్యక్తం చేస్తూ భారీ బలగంతో చేరిన నాయకులు వలన పార్టీకి కొత్త ఊపు వచ్చింది అని, మీ రాకతో క్యాడర్ లో కొత్త ఉత్సాహం వస్తుంది అని మీ సేవలు పార్టీ ఉన్నతికి మరింత ఉపయోగపడతాయని భావిస్తున్నాను అని ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసారు. సొంత కొడుకు లా చూసుకునే నాగబాబుకి నేను జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీలో చేరిన సీనియర్ నాయకులు బవిరిశెట్టి రాంబాబు (మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ), తాటిపర్తి కు చెందిన మాజీ ఎంపీటీసీ కుంపట్ల వీర సత్యనారాయణ, చేందుర్తి వాసి అయిన మాజీ ఏ.ఎం.సీ డైరెక్టర్ పినక వెంకట్రావు, కొత్తూరుకు చెందిన తెలుగురైతు కార్య నిర్వాహక కార్యదర్శి దూడ్డ నాగు, మాజీ సొసైటీ అధ్యక్షులు మోయల్లా వీర రాఘవ, వన్నెపూడి మాజీ సర్పంచ్ దొడ్డిపట్ల తిరుపతయ్య, మాజీ సర్పంచ్ గుడాల విరస్వామి, తాటిపర్తి తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అమలాకంటి వీరబాబు, మాజీ సొసైటీ డైరెక్టర్ గాదె మాణేశ్వరరావు, చిన్న జగ్గంపేట మాజీ సర్పంచ్ సారిపల్లి నాగేశ్వరావు, గౌతు సుబ్రహ్మణ్యం, భారతల గోవింద్, మాజీ నీటి సంఘము ప్రెసిడెంట్ భావిశెట్టి ప్రకాష్ మరియు తెలుగుదేశం పార్టీ కు చెందిన నాయకులు చింతల బాలయ్య, దూళిపూడి ప్రసాద్, పినక దుర్గ ప్రసాద్, మద్దాల రామకృష్ణ, తుంగపల్లి కృష్ణ, రెడనం సూరిబాబు, తుంగపల్లి వాసు, పాలశెట్టి తమ్మరావు, జ్యోతుల దత్త, అంబటి దుర్గ ప్రసాద్, పుప్పాల అశోక్, వీరంరెడ్డి అమర్, సింగినిడి నానాజీ, ముప్పిడి నారాయణ రెడ్డి, సైతన రాంబాబు, బాట కిర్తి, దంగేటి సింహాచలం, నక్క శ్రీను బద్రి, దూడ రాంబాబు, చవాల మోసే, మోయల్లా భాను ప్రసాద్, కిర్తి సత్యనందం, మాలిక శ్రీను మరియు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మేకల కృష్ణ లను పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు కండువా వేసి సాధారంగా ఆహ్వానించారు.