అఖిల్ సినిమా రొమాంటిక్ పోస్టర్ రిలీజ్

అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ – వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు సిద్ శ్రీరామ్ ఆలపించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘మనసా మనసా’ విశేష ఆదరణ పొందాయి. ఈ క్రమంలో మా బ్యాచిలర్ & బ్యాచిలరెట్ క్వారంటైన్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి అంటూ ఒక రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.