జైలు నుంచి విడుదలైన అఖిలప్రియ

మాజీమంత్రి అఖిలప్రియ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలు ఉన్న అఖిలప్రియకు సెషన్స్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరుచేసింది. రూ.10 వేల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. బెయిల్ ఆర్డర్ కాపీలను చంచల్‌గూడ జైలు అధికారులు ఆమె తరపు న్యాయవాదులు సమర్పించారు. అనంతరం ఆమెను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. అఖిలప్రియకు స్వాగతం పలికేందుకు ఆమె స్వంత గ్రామం ఆళ్లగడ్డ నుంచి భారీగా టీడీపీ కార్యకర్తలు వచ్చారు. కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ చంచల్‌గూడ జైల్లో 17 రోజులుగా రిమాండ్‌లో ఉంటున్న విషయం తెలిసిందే.