అనంతవరం గ్రామములో ప్రచార కార్యక్రమం నిర్వహించిన అళహరి సుధాకర్

కావలి, జనసేన పార్టీ తరుపున జనసేన-టిడిపి-బిజేపి పొత్తులో భాగంగా కావలి ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థుల ప్రచారంలో భాగంగా కావలి నియోజకవర్గం, దగదర్తి మండలం, అనంతవరం గ్రామములో ప్రచారం నిర్వహణలో ఇంచార్జి అళహరి సుధాకర్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమము జనసేన మండల అభ్యక్ష్యుడు వెంకట్ యాదవ్ ఆధ్వర్యములో అనంతవరం గ్రామ అధ్యక్షుడు వాసు, నాయకులు వంశీ, మహేష్ ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించారు. అదే క్రమములో గ్రామ టిడిపి అధ్యక్షుడు మాల కొండయ్య మరియు హరిబాబులు అతిధ్యంతో ప్రచార కార్యక్రమం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమములో గ్రామ జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు కో-ఆర్డినేటర్ సుధీర్, మస్తాన్, రాజేష్, బాలు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.