అసత్య ప్రచారాలపై డిఎస్పికి ఫిర్యాదు చేసిన అళహరి సుధాకర్

కావలి, కరపత్రాలు ముద్రించి నాపై అసత్య, ఋజువులేని ప్రచారాలు చేస్తున్నారని కింద పేరుకూడా పెట్టికొలేని దమ్ములేని వాళ్ళు నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా చేస్తూ. వాట్సప్ గ్రూపులలో మార్ఫింగ్ చేసి సుకుమార్ రెడ్డి మీటింగ్ లో నేను ఉన్నట్లు ఫోటోలు పెట్టిన వారిని అరెస్టు చేసి ఖటినచర్యలు తీసుకోవాలని. నా జీవితములో ఒక్కసారి కూడా సుకుమార్ రెడ్డితో మాట్లాడింది కానీ, కలిసింది కానీ లేదు. అలాంటిది ఏకంగా వారి మీటింగ్ లో నేను ఉన్నట్లు మార్ఫింగ్ ఫోటోలు పెట్టారని నిన్న కావలి డిఎస్పికి గారిని కలిసి ఇలాంటి వారిపై ఖటిన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చిన అళహరి సుధాకర్ జనసేన ఇంఛార్జి కావలి నియోజకవర్. వెంటనే డిఎస్పికి పట్టణ సి.ఐ పిలిచి డీటెయిల్స్ ఇచ్చి వెంటనే చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు. అదే విధంగా సుధాకర్ ను నెల్లూరు లో సైబర్ క్రైమ్ బ్రాంచ్ లో కూడా ఫిర్యాదు చేసి, స్పందనలో ఎస్పికి కూడా రిపోర్ట్ చేయ్యలని కోరారు. పార్టీ ఆఫీస్ ఘనంగా ఓపెన్ చేస్తుంటే ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అని, నా సొంత డబ్బుతో ప్రతీ కార్యక్రమము చేస్తున్నాను అని ఎవడబ్బ సొమ్ము నాకు ఇవ్వలేదు అని ఎవరెవరినో అడుక్కొని కార్యక్రమాలు చేయ్యటం లేదు అని నా సొంత డబ్బుతో నా స్థలము అమ్మి పార్టీ కోసం ఖర్చు పెడతున్నా అని. ఎవడికైనా దమ్ము ఉంటే అసత్య ప్రచారాలు చేసే వాడు నిరూపించాలని, నేను పుట్టింది కావలిలో, పెరిగింది రైల్వే బిట్రగుంటలో అని, కేవలం పార్టీలో హుందాతనంగా ఉండాలన్న ఒక్క తలంపుతో కామ్ గా ఉంటున్నానే తప్ప నేను బిట్రగుంటలో, తిప్పలో చూడని రౌడీయిజాలు కాదు. ఇక ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అళహరి సుధాకర్ అన్నారు.