అఖిల కర్ణాటక పవర్ స్టార్ ఫాన్స్ సేవా సంఘ కార్యవర్గ సమావేశం

కర్ణాటక: అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం కార్యవర్గం సమావేశంలో అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం ఆధ్వర్యంలో చీకుబలపురు జిల్లా, చెలురు తాలూకాలో నిర్వహించడం జరిగింది. రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జనసేన పార్టీకి అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం ఏవిధంగా సేవలు అందించాలని కార్యవర్గం సభ్యులు రాష్ట్ర నాయకులు కార్యకర్తలు చర్చించారు. రాష్ట్ర నాయకులు రానున్న 6 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటూ జనసేన పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అన్ని జిల్లాల అధ్యక్షులు క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు.