ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలి

  • ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల తమ జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే దౌర్భాగ్య పరిస్థితి? ప్రతినెలపింఛనుదారులకు తమ పింఛన్ ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి?
  • అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం: గెలిచిన వారం రోజుల్లోనే సి పిఎస్ రద్దు చేస్తా? అధికారంలోకి వచ్చిన తక్షణమే మెరుగైన పి.ఆర్.సి చెల్లిస్తా? అని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక… ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని అడిగితే, ప్రభుత్వ ఉద్యోగులని వైసీపీ ప్రభుత్వం అష్ట కష్టాలకు గురి చేస్తూ, సకాలంలో జీతాలు కూడా చెల్లించకుండా? అపహేళన చేస్తూ, ప్రజల్లో చులకన చేయాలని వైసీపీ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో వికృత క్రీడ ఆడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు.. మనోవేదనతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని తికమక పరిస్థితుల్లో దాపురించినాయి. ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి, ఉపాధ్యాయుడు బోయ మల్లేష్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా బాధాకరం, ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెరిచి ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా సకాలంలో జీతాలు చెల్లించి వారి న్యాయమైన డిమాండ్లన్నింటినీ చిత్తశుద్ధితో పరిష్కరించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బోయ మల్లేష్ వారి కుటుంబ సభ్యుల్ని కలుసుకొని పరామర్శించి, వారికి మనోధైర్యాన్ని కల్పించి, జనసేన పార్టీ మీ కుటుంబానికి, ప్రభుత్వం ఉద్యోగులందరికీ ఎల్లవేళలా అండగా, అందుబాటులో ఉంటుందని భరోసా కల్పించడం జరిగింది. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఉపాధ్యాయుడిని వారి కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురిచేసి వైసీపీ ప్రభుత్వానికి చెందిన ఉన్న ఒక వార్త పత్రికలో.. అప్పులతో ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడని తప్పుడు కథనం రాయడం చాలా విడ్డూరంగా ఉంది. సాధ్యాసధ్యాలను పరిశీలించి జనసేన– టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నీటికి చక్కటి పరిష్కారం చూపుతాడు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు అధైర్య పడకండి అని భరోసా కల్పించిన అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, లీగల్ సెల్ అధ్యక్షుడు మురళీకృష్ణ, జనసేన నాయకులు మెరుగు శ్రీనివాస్ తదితరులు.